Sunday, November 15, 2009

చిల్లర ను గిఫ్ట్ కార్డు గ మార్చుకుంటే $10 ఫ్రీ

US లో ఇండియా లో లా చిల్లర ప్రాబ్లం వుండదు. చిల్లర ఇంట్లో కూడుతూ వుంటుంది. ఈ చిల్లరను ఒక్కోసారి వదిలించుకోవడం సమస్య. ఐతే మీకు cointstar మెషిన్ దగ్గర్లో వుంటే చిల్లరను వేసి అమెజాన్.కం , jc penyy, cvs లాంటి షాప్స్ కి గిఫ్ట్ కార్డు తీసుకోవచ్చు. అలా కాకుండా డాలర్లు కావాలంటే ఛార్జ్ చేస్తారు. డిసెంబర్ 12 వరకు $40 చిల్లర coinstar తో మార్చుకుని గిఫ్ట్ కార్డు తీసుకుంటే $10 గిఫ్ట్ కార్డు mail in rebate గా పొందవచ్చు. చిల్లర అలా పడి వుండే బదులు మార్చుకొని గిఫ్ట్ కార్డ్స్ తీసుకోండి . $10 బోనస్. మీకు దగ్గర లోని coinstar కోసం వెబ్ సైట్ లో చూడండి. ఇవి చాలా shoprite, shaws,stop& shop లాంటి గ్రోసెరీ స్టోర్స్ లో వున్నాయి.

4 comments:

  1. ఈ కాయన్ స్టార్ చిల్లర నుండి డాలర్ నోట్లు కి మార్చడానికి చార్జ్ చేస్తునందని విని నేను ఎప్పుడూ ఉపయొగించలేదు . ఈ గిఫ్ట్ కూపన్ సిస్టం బావుందే.. మీ సలహాలు చాలా ఉపయొగకరం గా వుంటున్నాయి. మాతొ పంచుకుంటున్నందుకు ధన్యవాదాలు.

    ReplyDelete
  2. అప్పుడెప్పుడో నేను ఐదారేళ్లుగా పోగేసిన అణాలూ కాణీలూ కాయిన్‌స్టార్‌కి అప్పగిస్తే లెక్కేసి నూటపాతిక డాలర్ల దాకా తేల్చింది. 'ఉన్న పళాన డబ్బులియ్యమంటే కమీషన్ కట్టాలి, అలాక్కాకుండా ఏదన్నా గిఫ్ట్ కార్డుచ్చుకుంటే నో కమీషన్' అంటే కక్కుర్తి పడి పియర్ 1 ఇంపోర్ట్స్ వాళ్ల కార్డు తీసుకున్నానా, ఆ తర్వాత అవసరం లేకపోయినా అక్కడ పనికి రాని వస్తువులేవో కొని ఆ కార్డుని ఖర్చు చెయ్యాల్సొచ్చింది. నా నూట పాతిక డాలర్లకొచ్చేవి అక్కడేమీ లేవు - దాంతో జేబులోంచి మరికాస్త గొరుగుడు. అదనంగా, మనకి పనికొచ్చే వస్తువే కొందాం అనుకుంటూ మా ఏరియాలో ఉన్న పియర్ 1 ఇంపోర్ట్స్ దుకాణాలన్నీ వరసబెట్టి చుట్టేయటానికైన పెట్రోలు + కొన్ని గంటల సమయం ఖర్చు.

    నీతి: కొండొకచో కమీషన్ కట్టి అప్పటికప్పుడు డబ్బుల్దీసుకోటమే బెటర్ :-)

    ReplyDelete
  3. ఆక్చువలీ, కాస్త ఓపిక చేసుకుని కాయిన్లని గొట్టాల్లో అమర్చి బేంకులో కడితే మీ ఎకవుంట్లో జమచేస్తారు, లేదంటే నోట్లిస్తారు.

    ReplyDelete
  4. anduke nenu amazon.com gift card ichche coinstar lo coins marustanu.

    ReplyDelete