ఇప్పటికే చాలామందికి వాళ్ళ కంపనీల నుండి బెనిఫిట్స్ సెలక్షన్ లెటర్స్ వచ్చి వుంటాయి. మీరు కూడా నాలా అది ఓ సారీ చూసి పక్కన పడేసే టైపు ఐతే కాస్త ఆలోచించండి. ఇది వచ్చే సంవత్సరానికి మన financial ప్లానింగ్ కి చాలా ముఖ్యమయిన పార్ట్.
ఇందులో మొదటిది మన health insurance. దీన్ని మనం సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే మార్చుకోవచ్చు. అంతే కాకుండా ప్రతిసంవత్సరం మన contribution కూడా మారుతుంది. మన అవసరాలని బట్టి మన ఇన్సురన్సు ఒప్షన్స్ ని మార్చుకోవాలి. సాధారణంగా PPO లకంటే HMO లకు ప్రీమియం తక్కువ. మన ప్రైమరీ కేర్ డాక్టర్ HMO లిస్టు లో వుంటే HMO తీసుకోవడం financial గా బెటర్. ఐతే HMO లు కొన్ని సర్వీసెస్ cover చేయకపోవచ్చు. Especially eyecheckup చాలాఇన్స్యూరన్సులు cover చేయవు . అలాగే మీకు డెంటల్ ప్రాబ్లంస్ వుంటే Delta dental లేదా Aetna లాంటి డెంటల్ ఇన్స్యూరన్స్ తీసుకోండి. ఎందుకంటే ఇక్కడ డెంటల్ కేర్ చాలా కాస్ట్లీ.
2010 financial planning గురించి మరిన్ని వివరాలు మరో పోస్ట్ లో ట్రై చేస్తాను.
No comments:
Post a Comment