Showing posts with label kodak gallery. Show all posts
Showing posts with label kodak gallery. Show all posts

Tuesday, October 27, 2009

మన డాలర్


మన డాలర్ కి స్వాగతం. ఎన్నో వేళ బ్లాగులు, బ్లాగ్గర్లు వుండగా మళ్ళీ కొత్త బ్లాగ్ ఎందుకంటారా ? ఎందుకంటే నేను చూసిన చాలా బ్లాగులు కథలు,కధనాలు,వార్తలు,కవితలు ఇలాంటివాటికోసం వున్నాయి. కాని personal finannce కోసం తెలుగు లో నాకు ఎలాంటి బ్లాగులు కనబడలేదు. ఆ లోటును పూడ్చే ప్రయత్నమే ఈ బ్లాగు. గత 5-6 సంవత్సరాలు అమెరికా లో వుండి నేను తెలుసుకున్నది ఏంటంటే ఇండియా లో కంటే ఇక్కడ ఏదైనా deal లో దొరుకుతుంది ,కాకపోతే అది తెలిసిన వాళ్ళు వుపయోగించుకుంటారు తెలీని వాళ్లు కష్టపడి సంపాదించిన డాలర్లు పోగొట్టుకుంటారు. 1 డాలర్ మిగిలించడం 1.25 డాలర్ సంపాదించినట్టు ఎందుకంటే మనం సంపాదించే ప్రతి డాలర్ కి మనం 25% టాక్స్ కడతాం కాబట్టి.
మరి ఈరోజు డీల్ : www.kodakgallery.com లో కొత్తగా రిజిస్టర్ చేసుకుంటే $ 15 కూపన్ ఇస్తున్నారు. ఈ కూపన్ తో మీరు ఫోటోలు ప్రింట్ చేసుకోవచ్చు లేకపోతే ఫోటో mug లాంటివి కొనుక్కోవచ్చు