మీ కంపెనీ లో మీకు 401 k అవకాశం వుందా ? ఐతే తప్పక వుపయోగించుకోండి.
1.ఇక్కడ చాలా కంపనీలలో రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ అనే concept లేదు . మన రిటైర్మెంట్ కి మనమే ప్లాన్ చేసుకోవాలి. ఐతే 401k ద్వారామనము tax కట్టకుండా మనము సేవ్ చేసుకోవచ్చు.
2.ప్రతి సంవత్సరము మనము ఎంత 401K లో ఎంత సేవ్ చేయవచ్చో గొవ్త్. నిర్ణయిస్తుంది. ఈ సంవత్సరానికి $ 16500 వరకుమనము contribute చేయవచ్చు.
౩. కొన్ని కంపెనీలు 401 k కి కొంతవరకు మ్యాచ్ చేస్తాయి. అది ఫ్రీ గా వచ్చే మనీ కదా. వదులుకోవడం ఎందుకు?
4. చాలా మంది 401k లో contribute చేయాలంటే stocks గురించి తెలిసి వుండాలి అనుకుంటారు. కాని మనకు అంత knowledge అవసరం లేదు. అన్ని స్టాక్ బ్రోకర్లు టార్గెట్ ఫండ్స్ అని ఆఫర్ చేస్తారు. ఉదాహరణకు మనం 2030 లో రిటైర్ అవుతాము అనుకుంటే 2030 ఫండ్ మనము సెలెక్ట్ చేసుకుంటే , వాళ్ళు మేనేజ్ చేస్తారు. మన రిటైర్మెంట్ దగ్గర పడే కొద్ది , stocks లో కాకుండా bonds లో ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తారు.
5. ఐతే 401k లో ఇన్వెస్ట్ చేసిన మనీ ని మనకు 59 1/2 సంవత్సరాలు వచ్చినంత వరకు తీయకూడదు. తీస్తే 10 % ఫైన్ + tax కట్టాలి. మనం ఇండియా కి వెళ్తున్నా ఫైన్ కట్టకుండా తీసుకోలేము.
No comments:
Post a Comment