Wednesday, December 30, 2009

ఇండియా కు ఫ్రీ గా ఫోన్ calls


ఈ న్యూ ఇయర్ ఇండియా కు ఫ్రీ గా ఫోన్ చేయాలనుకుంటున్నారా? ఐతే మీకు ఇంటర్నెట్ వుంటే చాలు. http://www.pennytel.com/ లో ఫ్రీ గా రిజిస్టర్ చేసుకోండి. Jan 2 వరకు ఇండియా కు ఫ్రీ గా ఫోన్ చేసుకోండి. రిజిస్టర్ చేసుకున్న తర్వాత my portal అనే చోట క్లిక్ చేయండి. Left లో pennysofthone మీద క్లిక్ చేస్తే dialpad వస్తుంది . అది వుపయోగించి ఫ్రీ కాల్స్ చేయొచ్చు. మీదగ్గర VOIP adapatar వుంటే SIP ప్రోటోకాల్ ప్రకారం కనెక్ట్ చేసుకొని రెగ్యులర్ ఫోన్ ని కూడా వాడొచ్చు.

Sunday, December 27, 2009

tacobell లో free taco


మీకు దగ్గర లో tacobell ఉంటే ఈ కూపన్ ప్రింట్ చేసుకొని ఒక taco ఫ్రీ గా పొందండి.

Thursday, December 10, 2009

మంచి paid survey సైట్


మీరు ఎప్పుడైనా pinecone survey గురించి విన్నారా? ఇది నాకు తెలిసిన paid survey sites లో బెస్ట్. ఈ సైట్ లో రిజిస్టర్ చేసుకుంటే మనము చేసే ప్రతి సర్వేకి $ 3-00 ఇస్తారు. సర్వే చేసిన మరుసటి రోజు మన paypal ఎకౌంటు లో డిపాజిట్ చేస్తారు. ఇందులో రిజిస్టర్ చేసుకోవడానికి అప్పుడప్పుడే ఓపన్ చేస్తారు. మీకు ఇంట్రెస్ట్ వుంటే పైన క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోండి. మీరు disappoint కారు అని నా నమ్మకం.

Thursday, November 26, 2009

వీడియో చూసి సర్వే చేస్తే డబ్బు.

ఇంటర్నెట్ లో సర్వే చేస్తే డాలర్లు అంటూ చాల కంపనీలు వున్నాయి. అందులో సగానికి పైగా బోగస్. కొన్నయితే అర్ధగంట చేస్తే అర్ధ డాలర్ లేదా డాలర్ అంటారు. కాని కొన్ని బాగా పే చేసే కంపెనీలు కూడా వున్నాయి. అలాంటిదే HCD SURVEYS. వీళ్ళు అప్పుడప్పుడు ఒక వీడియో ని చూసి అందులోని విషయం తో ఎంత ఎకీభవిస్తామో తెలపాలి అంతే. అంతా 5 నిముషాలు కూడా పట్టదు. ప్రతి సర్వే కి 1/2 డాలర్ నుండి 1 డాలర్ వరకు ఇస్తారు. మొదట రిజిస్టర్ చేసుకున్నప్పుడు 1 డాలర్ ఫ్రీ గా ఇస్తారు.
Youdata లో ads చూస్తే డాలర్లు.
1800-free-411 తో ఇండియా కి ఫ్రీ ఫోన్ కాల్. ఇదీ ఇప్పటికి ఫ్రీ గిఫ్ట్స్ లిస్టు.

Saturday, November 21, 2009

రోజూ ఇండియా కి ఫ్రీ గా ఫోన్ చేయండి.

1. 1 800 FREE 411 కి ఫోన్ చేయండి.
2. అడ్వర్టయిజ్మెంట్ తర్వాత ఫ్రీ ఫోన్ కాల్ ని సెలెక్ట్ చేసుకోండి.
3.నంబర్ ఎంటర్ చేయమన్నప్పుడు 01191 తో కలిపి ఫోన్ నంబర్ ఎంటర్ చేయండి.
4. అయిదు నిమిషాలు ఇండియా కి ఫ్రీ గా మాటలాడండి.

నా పోస్ట్ నచ్చితే పక్కన మీ ఈమెయిలు తో రిజిస్టర్ చేసుకోండి. నా పోస్ట్ లు మీ mailbox లో పొందండి. ఎలాంటి spam మెయిల్స్ పంపననన్నది నా హామీ. :)

Monday, November 16, 2009

50 ఫోటో కార్డులను ఫ్రీ గా పొందండి.

1.Fuji film వాళ్ళ seehere.com వెబ్ సైట్ లో రిజిస్టర్ చేసుకోండి.
2. తర్వాత ఫోటో కార్డులు సెలెక్ట్ చేసుకోండి. చాలా designs నుండి సెలెక్ట్ చేసుకోవచ్చు.
3. మీకు నచ్చిన ఫోటో అప్ లోడ్ చేయండి. మీకు నచ్చిన విధంగా ఫోటో కార్డు చేసుకోవచ్చు.
4. చెక్ అవుట్ అప్పుడు newbaby కోడ్ ఉపయోగించండి.
5. ఫోటోలు, postage కూడా ఫ్రీ.
6. పిల్లలు, పిల్లుల్లు వున్నవాళ్ళు ఈ ఫోటో కార్డ్స్ న్యూ ఇయర్ గ్రీటింగ్స్ గా పంపవచ్చు. :)

Sunday, November 15, 2009

చిల్లర ను గిఫ్ట్ కార్డు గ మార్చుకుంటే $10 ఫ్రీ

US లో ఇండియా లో లా చిల్లర ప్రాబ్లం వుండదు. చిల్లర ఇంట్లో కూడుతూ వుంటుంది. ఈ చిల్లరను ఒక్కోసారి వదిలించుకోవడం సమస్య. ఐతే మీకు cointstar మెషిన్ దగ్గర్లో వుంటే చిల్లరను వేసి అమెజాన్.కం , jc penyy, cvs లాంటి షాప్స్ కి గిఫ్ట్ కార్డు తీసుకోవచ్చు. అలా కాకుండా డాలర్లు కావాలంటే ఛార్జ్ చేస్తారు. డిసెంబర్ 12 వరకు $40 చిల్లర coinstar తో మార్చుకుని గిఫ్ట్ కార్డు తీసుకుంటే $10 గిఫ్ట్ కార్డు mail in rebate గా పొందవచ్చు. చిల్లర అలా పడి వుండే బదులు మార్చుకొని గిఫ్ట్ కార్డ్స్ తీసుకోండి . $10 బోనస్. మీకు దగ్గర లోని coinstar కోసం వెబ్ సైట్ లో చూడండి. ఇవి చాలా shoprite, shaws,stop& shop లాంటి గ్రోసెరీ స్టోర్స్ లో వున్నాయి.

Thursday, November 12, 2009

2010 సంవత్సరానికి financial planning- 401 K

మీ కంపెనీ లో మీకు 401 k అవకాశం వుందా ? ఐతే తప్పక వుపయోగించుకోండి.
1.ఇక్కడ చాలా కంపనీలలో రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ అనే concept లేదు . మన రిటైర్మెంట్ కి మనమే ప్లాన్ చేసుకోవాలి. ఐతే 401k ద్వారామనము tax కట్టకుండా మనము సేవ్ చేసుకోవచ్చు.
2.ప్రతి సంవత్సరము మనము ఎంత 401K లో ఎంత సేవ్ చేయవచ్చో గొవ్త్. నిర్ణయిస్తుంది. ఈ సంవత్సరానికి $ 16500 వరకుమనము contribute చేయవచ్చు.
౩. కొన్ని కంపెనీలు 401 k కి కొంతవరకు మ్యాచ్ చేస్తాయి. అది ఫ్రీ గా వచ్చే మనీ కదా. వదులుకోవడం ఎందుకు?
4. చాలా మంది 401k లో contribute చేయాలంటే stocks గురించి తెలిసి వుండాలి అనుకుంటారు. కాని మనకు అంత knowledge అవసరం లేదు. అన్ని స్టాక్ బ్రోకర్లు టార్గెట్ ఫండ్స్ అని ఆఫర్ చేస్తారు. ఉదాహరణకు మనం 2030 లో రిటైర్ అవుతాము అనుకుంటే 2030 ఫండ్ మనము సెలెక్ట్ చేసుకుంటే , వాళ్ళు మేనేజ్ చేస్తారు. మన రిటైర్మెంట్ దగ్గర పడే కొద్ది , stocks లో కాకుండా bonds లో ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తారు.
5. ఐతే 401k లో ఇన్వెస్ట్ చేసిన మనీ ని మనకు 59 1/2 సంవత్సరాలు వచ్చినంత వరకు తీయకూడదు. తీస్తే 10 % ఫైన్ + tax కట్టాలి. మనం ఇండియా కి వెళ్తున్నా ఫైన్ కట్టకుండా తీసుకోలేము.

Sunday, November 8, 2009

2010 సంవత్సరానికి financial planning- హెల్త్ ఇన్స్యూరన్స్

ఇప్పటికే చాలామందికి వాళ్ళ కంపనీల నుండి బెనిఫిట్స్ సెలక్షన్ లెటర్స్ వచ్చి వుంటాయి. మీరు కూడా నాలా అది ఓ సారీ చూసి పక్కన పడేసే టైపు ఐతే కాస్త ఆలోచించండి. ఇది వచ్చే సంవత్సరానికి మన financial ప్లానింగ్ కి చాలా ముఖ్యమయిన పార్ట్.
ఇందులో మొదటిది మన health insurance. దీన్ని మనం సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే మార్చుకోవచ్చు. అంతే కాకుండా ప్రతిసంవత్సరం మన contribution కూడా మారుతుంది. మన అవసరాలని బట్టి మన ఇన్సురన్సు ఒప్షన్స్ ని మార్చుకోవాలి. సాధారణంగా PPO లకంటే HMO లకు ప్రీమియం తక్కువ. మన ప్రైమరీ కేర్ డాక్టర్ HMO లిస్టు లో వుంటే HMO తీసుకోవడం financial గా బెటర్. ఐతే HMO లు కొన్ని సర్వీసెస్ cover చేయకపోవచ్చు. Especially eyecheckup చాలాఇన్స్యూరన్సులు cover చేయవు . అలాగే మీకు డెంటల్ ప్రాబ్లంస్ వుంటే Delta dental లేదా Aetna లాంటి డెంటల్ ఇన్స్యూరన్స్ తీసుకోండి. ఎందుకంటే ఇక్కడ డెంటల్ కేర్ చాలా కాస్ట్లీ.
2010 financial planning గురించి మరిన్ని వివరాలు మరో పోస్ట్ లో ట్రై చేస్తాను.

Thursday, November 5, 2009

40 డాలర్ల విలువయిన flowers ఫ్రీ గిఫ్ట్

1. 1800flowers.com వెబ్ సైట్ లో freshrewards ప్రోగ్రాం కి రిజిస్టర్ చేసుకోండి.
2. తర్వాత 10 gift reminders enter చేయండి
౩. 40 డాలర్ల విలువయిన freshrewards పాయింట్స్ 2-3 వారాల తర్వాత డిపాజిట్ అవుతాయి.

www.youdata.com
లో రిజిస్టర్ చేసుకుంటే Ads చూసినందుకు $$ సంపాదించవచ్చు. Youdata గురించి నా రివ్యూ ఇక్కడ.

Wednesday, November 4, 2009

అడ్వర్టయిజ్మెంట్ చూసి డాలర్లు సంపాదించడం ఎలా?


ఇంటర్నెట్ అనేది మాయ ప్రపంచం. రోజు మిలియన్లు సంపాదించే మార్గాలు అంటూ వందల వేళ ఈ-మెయిల్ లు మనకు వస్తుంటాయి. ఇవి అన్నీ మోసం అని చిన్న పిల్లాడయినా చెప్పగలడు. కానీ ఇంటర్నెట్ లో నిజంగానే ఫ్రీ డాలర్లు సంపాదించే మార్గాలు కూడా వున్నాయి. అయితే వీటితో వందలు ,వేలు డాలర్లు సంపాదించలేము. కాని నా దృష్టి లో 1 డాలర్ కు వుండే విలువ దానికి వుంది. అందుకే ఇలాంటి నిజమయిన కంపనీలను కనుక్కొని చెప్పడమే నా పని.
ఇలాంటి కంపనీలలో మొదటిది www.youdata.com.
1.మొదట మనము చేయవలసింది, ఈ వెబ్ సైట్ లో రిజిస్టర్ చేసుకోవడం.
2.తర్వాత అందులో yourmefile అనే చోట మన ఇష్టాఇష్టాలు గురించి చెప్పాలి.
3. Housekeeping అనే చోట మన సెల్ నెంబర్ ఇస్తే ఒక confirmation కోడ్ పంపిస్తారు. ఆ కోడ్ తో మన ఫైల్ activate చేసుకోవాలి.
4. Housekeeping లోనే మన paypal అడ్రస్ కూడా update చేయాలి.
5.Adgets అనే చోట మనకు ఎలాంటి ads వున్నాయో చూపిస్తుంది. వాటిమీద క్లిక్ చేస్తే అక్కడ చూపించిన అమౌంట్ మనకు వస్తుంది.
6. ప్రతి friday మన paypal ఎకౌంటు కి మన మనీ వస్తుంది.
ఇది చాలా సింపుల్,straight forward వెబ్ సైట్. కాని మొదటి కొన్ని వారల తర్వాత మనకు Ads తగ్గుతాయి.
ఇంకో విషయం ఏంటంటే మనమే ప్రతి వరం ఈ సైట్ కి వెళ్లి ads వున్నాయా అని చూసుకోవాలి. వాళ్ళు ఎలాంటి e-mails పంపారు. నా వరకు ఐతే ఇప్పటికి ఓ $20 వరకు వచ్చింది.
మరి ఇక్కడ రిజిస్టర్ చేసుకోండి . www.youdata.com

Thursday, October 29, 2009

150 డాలర్లకే జీవితకాల ఫోన్ కనెక్షన్

ఇప్పుడు అందరికీ ఇంట్లో ఇంటర్నెట్ కనెక్షన్ వుండే వుంటుంది. మరి ఈ ఇంటర్నెట్ కనెక్షన్ తో ఫోన్ సర్వీసు ఫ్రీగా ఇస్తే ? ఇలాంటి ఆలోచనతో వచ్చినదే vonage. కాకపోతే vonage కి ప్రతినెలా టెలిఫోన్ సర్వీసు కి ఫీజు కట్టాలి. కానీ Ooma అనే కంపెనీ , వాళ్ళOoma hub కొనుక్కుంటే జీవితకాలం US incoming & outgoing calls ఫ్రీ గా ఇస్తున్నారు. ఇప్పుడు amazon.com లో దీన్ని $200 కే అమ్ముతున్నారు . అంతేకాదు దీనితోపాటు 4 gb Ipod shuffle కూడా ఫ్రీ గా ఇస్తున్నారు. అంటే $150 కే Ooma అన్నమాట . మొదట Ooma ని షాపింగ్ కార్ట్ లో వేసుకొని, తర్వాత మీ బ్రౌజరు లో వెనక్కివెల్లి Ipod shuffle 4gb ని కలుపుకొంది. చివరలో Ipod రేట్ ని డిస్కౌంట్ చేస్తారు. Ooma ని US లోనే కాకుండా broadband కనెక్షన్ వుంటే ఎక్కడయినా వాడుకోవచ్చు. ఇండియా కి కూడా పంపీవచ్చు. Ooma వాడినవాళ్ళుచాలావరకు satisfied.

Tuesday, October 27, 2009

మన డాలర్


మన డాలర్ కి స్వాగతం. ఎన్నో వేళ బ్లాగులు, బ్లాగ్గర్లు వుండగా మళ్ళీ కొత్త బ్లాగ్ ఎందుకంటారా ? ఎందుకంటే నేను చూసిన చాలా బ్లాగులు కథలు,కధనాలు,వార్తలు,కవితలు ఇలాంటివాటికోసం వున్నాయి. కాని personal finannce కోసం తెలుగు లో నాకు ఎలాంటి బ్లాగులు కనబడలేదు. ఆ లోటును పూడ్చే ప్రయత్నమే ఈ బ్లాగు. గత 5-6 సంవత్సరాలు అమెరికా లో వుండి నేను తెలుసుకున్నది ఏంటంటే ఇండియా లో కంటే ఇక్కడ ఏదైనా deal లో దొరుకుతుంది ,కాకపోతే అది తెలిసిన వాళ్ళు వుపయోగించుకుంటారు తెలీని వాళ్లు కష్టపడి సంపాదించిన డాలర్లు పోగొట్టుకుంటారు. 1 డాలర్ మిగిలించడం 1.25 డాలర్ సంపాదించినట్టు ఎందుకంటే మనం సంపాదించే ప్రతి డాలర్ కి మనం 25% టాక్స్ కడతాం కాబట్టి.
మరి ఈరోజు డీల్ : www.kodakgallery.com లో కొత్తగా రిజిస్టర్ చేసుకుంటే $ 15 కూపన్ ఇస్తున్నారు. ఈ కూపన్ తో మీరు ఫోటోలు ప్రింట్ చేసుకోవచ్చు లేకపోతే ఫోటో mug లాంటివి కొనుక్కోవచ్చు